Palestinians : అల్‌ – షిఫా ఆస్పత్రి నుండి ఇజ్రాయిల్‌ దళాల ఉపసంహరణ

గాజా స్ట్రిప్‌ :  రెండు వారాల దాడి అనంతరం గాజాలోని అల్‌-షిఫా ఆస్పత్రి ఇజ్రాయిల్‌ తన దళాలను సోమవారం ఉపసంహరించుకుందని పాలస్తీనియన్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్‌ దళాలు విధ్వంసం సృష్టించాయని అన్నారు. వందలాది మంది ఆస్పత్రికి తిరిగి చేరుకుంటున్నారని, ఆస్పత్రి లోపల, వెలుపల పలు మృతదేహాలన గుర్తించామని వెల్లడించారు.

ఆస్పత్రిలోని    పలు భవనాలు దగ్ధమయ్యాని,  ఆస్పత్రి లోపల  రెండు మృతదేహాలు, వెలుపల ఆరు మృతదేహాలను గుర్తించామని తిరిగి  ఆ ప్రాంతానికి చేరుకున్న మొహమ్మద్‌ మహదీ తెలిపారు. పలువురు రోగులు, వైద్య సిబ్బంది, నిరాశ్రయులు లోపల ఆశ్రయం పొందుతున్నారని మరో వ్యక్తి యాషియా అబు తెలిపారు. చాలా మంది రోగులను సమీపంలోని అహ్లీ ఆస్పత్రికి తరలించామని అన్నారు. ఆస్పత్రి కాంపౌండ్‌లో తాత్కాలిక శ్మశాన వాటికపై ఆర్మీ బుల్డోజర్లు తవ్వాయని అన్నారు.

ఆరు నెలల యుద్ధంలో ఈ దాడి అత్యంత విజయవంతమైన ఆపరేషన్‌గా ఇజ్రాయిల్‌ సైన్యం అభివర్ణించింది. ఈ దాడిలో హమాస్‌, ఇతర తీవ్రవాదులను హతమార్చిందని, అత్యంత విలువైన రహస్య సమాచారాన్ని చేజిక్కించుకున్నామని తెలిపింది.

➡️