వ్యవసాయ పాత్రికేయులు రవివర్మ ఇకలేరు

కొచ్చి : వ్యవసాయ రంగ జర్నలిజంలో సుప్రసిద్ధలైన ఆర్‌టి రవి వర్మ తన 100వ ఏట మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొచ్చిన్‌ రాజకుటుంబానికి చెందిన రవివర్మ త్రిసూర్‌లోని తన నివాసంలో మరణించారు. మధ్యాహ్నం 3 గంటలకు శాంతి ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ‘సిరి’ అనే కలం పేరుతో సుపరిచితులైన ఆయనను అగ్రి జర్నలిజంలో మార్గదర్శకులుగా పరిగణిస్తారు. పూణే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడై ఆ తర్వాత కేరళ వ్యవసాయ విభాగంలో చేరారు. మూడు దశాబ్దాల పాటు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని వ్యవసాయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. పదవీవిరమణ తరువాత కేరళ విశ్వ విద్యాలయంలో జర్నలిజం విభాగంలో సేవలందించారు.కర్షకశ్రీ పత్రికకు వ్యవస్థాపక సంపాదకులుగా వ్యవహరించారు.

➡️