పాకిస్థాన్‌ ప్రధానిగా ఎన్నికైన షహబాజ్‌ షరీఫ్‌

Mar 3,2024 17:00 #Pakistan, #prime minister

 ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌ ప్రధానిగా రెండోసారి షహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి), పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి షహబాజ్‌ నేతృత్వం వహించనున్నారు. ఆదివారం ప్రధానిని ఎన్నుకునేందుకు పాకిస్థాన్‌ అసెంబ్లీ సమావేశమైంది. మొత్తం 336 మంది సభ్యుల ఓట్లలో షహబాజ్‌ 201 ఓట్లు పొందారు. జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీకి చెందిన ఒమర్‌ అయూబ్‌ ఖాన్‌ కేవలం 92 ఓట్లు మాత్రమే పొందారు. షహబాజ్‌ మార్చి 4న రాష్ట్రపతి భవనం ఐవాన్‌-ఎ-సదర్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షహబాజ్‌ 2022 ఏప్రిల్‌ నుండి ఆగస్టు 2023 వరకు సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానిగా పనిచేశారు. సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఈ పార్లమెంటను రద్దు చేశారు.

➡️