సెప్టెంబరులో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు

May 10,2024 08:25

కొలంబో : శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబరు 17, అక్టోబరు 16 మధ్య నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట కాలపరిమితిలో అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు నామినేషన్లు ఆహ్వానిస్తామని ఎన్నికల కమిషన్‌ చైర్మన్‌ రత్ననాయకె తెలిపారు. కొత్త చిహ్నంతో అధ్యక్షులు రణీల్‌ విక్రమసింఘె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్నట్లు గత నెల్లో ఆయన సన్నిహితులు తెలిపారు. 2022 మేలో ప్రభుత్వ ఆర్థిక సంక్షోభానికి నిరసనగా అనూహ్య రీతిలో కొనసాగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల అనంతరం మహిందా రాజపక్సాను ప్రధానిగా విక్రమసింఘె తొలగించారు. ఆ తర్వాత రెండు నెలలకు అధ్యక్షునిగా గొటబయా రాజపక్సాను తొలగించి తాను అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ అధ్యక్షులు, శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పి) చైర్మన్‌ మైత్రిపాల సిరిసేన ఇటీవల మాట్లాడుతూ, తమ పార్టీ తరపున ప్రస్తుతం న్యాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న విజయదాస రాజపక్సా పోటీ చేస్తారని తెలిపారు.

➡️