ఉపాధి కూలీల బకాయిలు విడుదల చేయాలి

సిపిఎం ఆధ్వర్యాన ధర్నా

ప్రజాశక్తి – పోడూరు

అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఉపాధి కూలీలు ఎంతో కష్టపడి పనులు చేశారని, వారికి రావలసిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని సిపిఎం మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్‌ అన్నారు. ఉపాధి హామీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, సుపర్నెంట్‌కు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పిల్లి ప్రసాద్‌ మాట్లాడుతూ ఉపాధి కూలీల బకాయిలు విడుదల చేయలేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మూడే మొజెస్‌, బురాబత్తుల వెంకటరావు, ఉపాధి హామీ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️