లండన్‌ వీధుల్లో కత్తితో వ్యక్తి స్వైర విహారం

  •  13ఏళ్ల బాలుడు మృతి

లండన్‌ : కత్తి పట్టుకుని ఒక వ్యక్తి తూర్పు లండన్‌ వీధుల్లో స్వైర విహారం చేస్తూ పలువురిని గాయపరిచాడని, ఈ దాడిలో 13ఏళ్ల బాలుడు మరణించాడని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు వున్నారు. సమురారు తరహాలోని కత్తిని పట్టుకుని దాడి చేసిన ఆ వ్యక్తి (36)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇది తీవ్రవాదానికి సంబంధించిన ఘటనగా తాము భావించడం లేదన్నారు. గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లామని వారు చికిత్స పొందుతున్నారని చెప్పారు. దేవుడిని నమ్ముతారా? అంటూ ఆ వ్యక్తి గట్టిగా అరుస్తూ ఇళ్ళ దగ్గరకు వచ్చి దాడికి ప్రయత్నించాడని, అప్పుడు తాను ఒక కిటికీ వెనక దాక్కున్నానని ఒక మహిళ తెలిపారు. ఏం జరుగుతోందో అర్థం కాలేదన్నారు.

➡️