వైద్య సిబ్బందిలా వచ్చి ముగ్గురు పాలస్తీనియన్ల కాల్చివేత

Jan 31,2024 10:43 #arrived, #Palestinians, #Shooting, #Three
  • అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ అంటూ ఇజ్రాయిల్‌ ప్రకటన

గాజా : ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని జెనిన్‌ నగరంలో ఒక ఆస్పత్రిలోకి వైద్య సిబ్బందిలా వచ్చిన ఇజ్రాయిల్‌ సైనికులు ముగ్గురు పాలస్తీనియన్లను కాల్చి చంపారు. ఐబిన్‌ సినా ఆస్పత్రిలో ఆ ముగ్గురు వ్యక్తులు నిద్రపోతుండగా, అండర్‌ కవర్‌ ఆపరేషన్‌లో భాగంగా ఈ హత్యలు జరిగాయని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఇజ్రాయిల్‌ ఆర్మీ ఒక ప్రకటన చేస్తూ, హమస్‌ తీవ్రవాద సెల్‌కు చెందిన వారు ఆస్పత్రిలో దాగుండగా, తమ సైనికులు వారిని చంపేశారని తెలిపింది. ఇందుకు సంబంధించి సెక్యురిటీ కెమెరా ఫుటేజీ ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. దాదాపు 12మంది వ్యక్తులు ముసుగులు వేసుకుని ఆస్పత్రిలో తిరగడం కనిపిస్తోంది. వారిలో ముగ్గురు మహిళల దుస్తుల్లో వున్నారు. ఇద్దరు వైద్య సిబ్బంది దుస్తుల్లో వున్నారు. అసాల్ట్‌ రైఫిళ్లతో వారు అక్కడి వారిపై విరుచుకుపడడం కనిపిస్తోంది. ఇజ్రాయిల్‌ సైన్యం గాజా నుండి జెనిన్‌ వరకు మా ప్రజలపై వారు పాల్పడే నేరాలకు అంతం లేకుండా పోతోందని హమాస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

➡️