ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి నివాసంపై ఇడి దాడులు

డెహ్రాడూన్‌ :    ప్రతిపక్షాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) దాడులు కొనసాగుతున్నాయి. డెహ్రాడూన్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి హరక్‌ సింగ్‌ రావత్‌ నివాసంపై ఇడి సోదాలు జరుపుతోంది. మనీలాండరింగ్‌ కేసులో ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్రంలోని కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌లో అక్రమ కార్యకలాపాలు జరిగాయని ఇడి ఆరోపిస్తోంది.

➡️