గడిచిన మూడేళ్లలో రూ.7,295.35 కోట్లు ఇచ్చాం : కేంద్రం

Dec 12,2023 10:43 #money

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్కీం ఫర్‌ స్పెషల్‌ అసిస్టెన్స్‌ టూ స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఎక్సెపెండేచర్‌’ కింద గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,295.35 కోట్లు, తెలంగాణకు రూ.3,073 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. కోవిడ్‌-19 దృష్ట్యా మూలధన వ్యయంలో రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించే పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా 50 ఏళ్లలో తిరిగి చెల్లించేలా వడ్డీ లేని రుణాన్ని సమకూర్చిందని తెలిపింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి అంశాలపై ఎంపిలు గజానన్‌ కీర్తికర్‌, కృపాల్‌ బాలాజీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. కోవిడ్‌ దృష్ట్యా రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థికసాయాన్ని అందించినట్లు తెలిపారు. ఈ స్కీమ్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో రూ.688 కోట్లు, 2021-22లో 501.79 కోట్లు, 2022-23లో 6,105.56 కోట్లు కేంద్రం విడుదల చేసిందన్నారు.

➡️