పార్లమెంట్‌ వద్ద భద్రతా ఉల్లంఘన కేసులోఆరో నిందితుడు అరెస్టు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వద్ద భద్రతా ఉల్లంఘన కేసులో సహ కుట్రదారుడు, ఆరో నిందితుడైన మహేష్‌ కుమవత్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పార్లమెంట్‌ వద్ద భద్రతా ఉల్లంఘనకు మహేష్‌ గత రెండేళ్లుగా కుట్ర పన్నుతూ వచ్చాడని చెప్పారు. మైసూరు, గురుగావ్‌, ఢిల్లీల్లో నిందితుడు పలు సమావేశాల్లో పాల్గన్నాడని, తమ డిమాండ్లు నెరవేరేలా చూసేందుకు అరాచకత్వాన్ని సృష్టించాలన్నదే వారి ఏకైక లక్ష్యమని పోలీసులు తెలిపారు. ఘటనలో ఉపయోగించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను ధ్వంసం చేశారని చెప్పారు. అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి (ప్రత్యేక న్యాయమూర్తి ఎన్‌ఐఎ) హర్‌దీప్‌ కౌర్‌ కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అఖండ్‌ ప్రతాప్‌ సింగ్‌ ఈ వాదనలు చేశారు. మహేష్‌ను 15 రోజుల కస్టడీకి కోరగా, కోర్టు ఏడు రోజులు రిమాండ్‌కు పంపింది. రాజధాని నుండి పారిపోయిన లలిత్‌ ఝాకు మహేష్‌, ఆయన కజిన్‌ కైలాష్‌ ఆశ్రయం ఇచ్చారని పోలీసులు తెలిపారు.

➡️