మధురైలో జల్లికట్టు పోటీలు.. 36 మందికి గాయాలు

Jan 15,2024 17:33

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మధురై జిల్లాలోని అవనియాపురంలో జల్లికట్టు పోటీలు సోమవారం నిర్వహించారు. ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు జల్లికట్టు పోటీలు నిర్వహించనున్నారు. జల్లికట్టు కోసం 1000 ఎద్దులు, 600 మంది యువకులు పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన ఈ పోటీల్లో 36 మంది యువకులు గాయపడ్డారు. గాయపడిన 36 మందిలో ఆరుగురిని చికిత్స నిమిత్తం మధురైలోని రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అవనియాపురం వద్ద జల్లికట్టు పోటీలు నిర్వహించే ప్రాంగణం వద్ద 800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వైద్య సేవలు అందించడానికి 20 మెడికల్‌ టీమ్‌ లు సిద్దంగా ఉన్నాయి.

➡️