లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం : మాయావతి

లక్నో : ‘ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం ‘ అని బిఎస్‌పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. నేడు మాయావతి పుట్టినరోజు సందర్భంగా … ఈరోజు లక్నోలో విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ … సమాజ్‌ వాదీ పార్టీతోపాటు బిజెపిని టార్గెట్‌ చేశారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. తమ పార్టీ మద్దతును నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా పార్టీకి తక్కువ ప్రాధాన్యత లభిస్తుందని అలాగే, ఓట్ల శాతం కూడా తగ్గుతుందన్నారు. అందుకే బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా పార్టీలు భావిస్తున్నాయి.. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. అత్యున్నత నాయకత్వం దళితుడి చేతిలో ఉండటంతో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని మాయావతి వెల్లడించారు.

➡️