రేవ్‌ పార్టీపై పోలీసుల దాడి.. 80 మంది అరెస్ట్‌

Dec 31,2023 14:50 #Drugs, #Maharashtra, #seized

థానే :    మహారాష్ట్రలో ఓ రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేశారు. సుమారు 80 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వీరంతా పార్టీలో అక్రమంగా డ్రగ్స్‌ తీసుకున్నారని, వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు. థానేలోని వడవలి క్రీక్‌ సమీపంలోని మారుమూల ప్రాంతంలోని బహిరంగ ప్రదేశంలో ఈ రేవ్‌ పార్టీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. పార్టీ నుండి ఎల్‌ఎస్‌డి, చరస్‌, ఎక్స్‌టసీ పిల్స్‌, గంజాయి వంటి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆహ్వానం పంపారని, ఇద్దరు నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

➡️