polling : మధ్యాహ్న 3 గంటలకు 49.2 శాతం పోలింగ్‌, బెంగాల్లో 70 శాతం

May 25,2024 12:47 #10, #Delhi, #percent polling registered

న్యూఢిలీ : ఆరోదశ పోలింగ్‌లో 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు 49.2 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 70.19 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక జార్ఖండ్‌లో 54.34 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 43.95 శాతం, ఒడిశాలో 48.44 శాతం, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లో 44.41 శాతం, బీహార్‌ 45.21 శాతం, హర్యానా 46.26 శాతం, ఢిల్లీ 44.58 శాతం పోలింగ్‌ నమోదైంది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

మధ్యాహ్నం 1 గంటకు 39.13 శాతం, బెంగాల్‌లో అత్యధికం 54 శాతం పోలింగ్‌

న్యూఢిల్లీ :  నేడు ఆరోదశ పోలింగ్‌ జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.13 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక మిగతా రాష్ట్రాల కన్నా పశ్చిమ బెంగాల్‌లోనే అత్యధికంగా 54.80 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. బీహార్‌ రాష్ట్రంలో 36.48 శాతం, హర్యానా 36.48 శాతం, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ 35.22 శాతం, జార్ఖండ్‌ 42.54 శాతం, ఢిల్లీలో 34.37 శాతం, ఒడిశాలో 35.69 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37.23 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌- రాజౌరి స్థానంలో రికార్డుస్థాయిలో 35.22 శాతం ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఆరవ విడత పోలింగ్‌ కొనసాగుతోన్న వేళ … దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం ఉదయం 9 గంటలకు 10 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఢి ల్లీలో ఉదయం 9 గంటల వరకూ సగటున 10 శాతం పోలింగ్‌ నమోదయింది. పశ్చిమ బెంగాల్‌లో గరిష్ఠంగా 16.54 పోలింగ్‌ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో 889 మంది అభ్యర్థుల భవిష్యత్తును 11 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ఓటు వేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, రావ్‌ ఇందర్‌జిత్‌ సింగ్‌, మంత్రి జైశంకర్‌ బిజెపి నేత మేనకా గాంధీ, సంబిత్‌ పాత్ర, మనోహర్‌ ఖట్టర్‌, మనోజ్‌ తివారీ, మహబూబా ముఫ్తీ, కాంగ్రెస్‌ నేత కన్హయ్య కుమార్‌, మాజీ క్రికెటర్‌ బిజెపి నేత గౌతం గంభీర్‌, తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపి రాహుల్‌ గాంధీ కూడా ఢిల్లీలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

➡️