కొత్త ఓటర్లలో 70 శాతం మంది లేబర్‌ ఫోర్స్‌కు వెలుపలే

Apr 19,2024 23:54

న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికల్లో 18.2 లక్షల మంది మొదటిసారి ఓటు వేయనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్త ఓటర్ల శాతంలో వీరిది 29.7 శాతమని పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) తెలిపింది. సర్వే ప్రకారం… ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లలో సుమారు 70 శాతం లేబర్‌ ఫోర్స్‌ (కార్మిక శక్తి)కి వెలుపల ఉన్నారు. కొద్దిశాతం మంది మాత్రమే పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 17 సంవత్సరాల వయసు గల వారు 18.6 శాతం, 18 సంవత్సరాల వయసు గలవారు 28.5 శాతం, 19 ఏళ్ల వయసు గలవారు 31.3 శాతం మాత్రమే ఉద్యోగం కానీ, లేదా ఏదైనా పని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలి ఓటర్లు (18ా19 వయస్కులు) పనికి దూరంగా ఉండడానికి ప్రధాన కారణం వారు చదువుకునేందుకు ఆసక్తి చూపడమే. ఈ విషయంలో పురుషులు మహిళలను పరిశీలిస్తే తేడా కనిపిస్తోంది. పురుషులు 95 శాతం మంది చదువుకోవడానికి ఇష్టపడుతూ, పనికి దూరమైతే.. ఇది మహిళల్లో 65 శాతం మాత్రమే. ఇక ఎస్‌టిలలో చదువుకునే యువత 67 శాతం…

ఓటు బుల్లెట్‌ కన్నా శక్తివంతమైంది : శివ కార్తికేయన్‌
చెన్నై : ఓటు బుల్లెట్‌కన్నా శక్తివంతమైనదని ప్రముఖ కోలీవుడ్‌ నటుడు శివకార్తికేయన్‌ అన్నారు. తొలిదశ పోలింగ్‌లో భాగంగా శుక్రవారం శివకార్తికేయన్‌ వలసరవక్‌లోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఓటు మనందరి హక్కు, ఓటు వేయడం మన విధి, తొలిసారి ఓటు వేస్తున్న వారికి నా అభినందనలు, ఎవరు ఏం చెప్పినా.. మీకు నచ్చిన అభ్యర్థికే మీరు ఓటు వేయండి. హాలిడే కదా అని ఇంట్లో ఉండకండి. అందరూ తప్పక ఓటేయండి.’ అని ఆయన అన్నారు.

➡️