ప్రజ్వల్‌ కోసం రెండో లుకౌట్‌ నోటీసు..ఇంటికి విచారణ బృందం

May 4,2024 15:30 #Prajwal, #Second lookout notice

కర్నాటక : సెక్స్‌ స్కాండల్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ రేవణ్ణ కోసం ఇవాళ రెండో లుకౌట్‌ నోటీసు జారీ చేశారు. ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు కోసం లుకౌట్‌ నోటీసు ఇచ్చినట్లు కర్నాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు. హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌, హౌలెనరసిపుర్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై నమోదు అయిన లైంగిక వేధింపుల కేసును ప్రత్యేక దర్యాప్తు బఅందం విచారిస్తున్నది. శుక్రవారం మరో మహిళ కూడా ఫిర్యాదు చేయడంతో .. ఆ ఇద్దరిపై ఐపీసీ సెక్షన్‌ 376 కింద రేప్‌ కేసును బుక్‌ చేశారు. మరో వైపు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. కర్నాటక సీఎం సిద్దరామయ్యకు ఇవాళ లేఖ రాశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ అశ్లీల వీడియో కేసులోని బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని ఆ లేఖలో ఆయన కోరారు. హేయమైన చర్యలకు పాల్పడిన వ్యక్తలను శిక్షించాలని రాహుల్‌ తన లేఖలో తెలిపారు.

➡️