అప్రూవర్‌గా మారేందుకు అనుమతివ్వండి

Dec 26,2023 10:56 #NewsClick
  •  న్యూస్‌క్లిక్‌ కేసులో హెచ్‌ఆర్‌ హెడ్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ    :   న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్‌గా మారేందుకు అనుమతి ఇవ్వాలంటూ న్యూస్‌క్లిక్‌ మానవ వనరుల అధిపతి అమిత్‌ చక్రవర్తి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. చైనాకు అనుకూలంగా కథనాలు రాసేందుకు బీజింగ్‌ నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలపై న్యూస్‌క్లిక్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసును ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్‌క్లిక్‌ ప్రధాన సంపాదకులు ప్రబీర్‌ పుర్కాయస్తా, అమిత్‌ చక్రవర్తిలను ఇప్పటికే అరెస్టు చేశారు. అప్రూవర్‌గా మారేందుకు అనుమతి ఇవ్వాలని అమిత్‌ చక్రవర్తి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీసులకు వెల్లడిస్తానని కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొన్నాడు. అమిత్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

➡️