హర్యానా ప్రభుత్వ నిర్బంధంపై ఆశాల ఆగ్రహం

  • ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి విజయవంతం

చండీగఢ్‌ : రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరి, అణచివేత చర్యలను నిరసిస్తూ హర్యానా అంతటా ఆశా వర్కర్లు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల కార్యాలయాలను శనివారం చుట్టుముట్టారు. 73 రోజుల సమ్మె అనంతరం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని సిఐటియు అనుబంధ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ఫిబ్రవరి 29న పంచకులలో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ ఆందోళనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఆశా వర్కర్లను అరెస్ట్‌ చేసి, నాయకులను నిర్బంధించారు. ఈ దమనకాండను వ్యతిరేకిస్తూ శనివారం చేపట్టిన ఆందోళనలు విజయవంతమయ్యాయి. ఈ ఆందోళనలకు సిపిఎం మద్దతు తెలిపింది. ఆశా వర్కర్లతో చేసుకున్న ఒప్పందాన్ని రాష్ట్రప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేసింది.

➡️