రెండోసారి రాజ్యసభకు అశ్వినీ వైష్ణవ్‌

Feb 14,2024 11:54 #BJP, #Rajya Sabha Candidate

న్యూఢిల్లీ :    కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, రెండోసారి ఒడిశా నుండి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి ఎల్‌. మురుగన్‌ను మధ్యప్రదేశ్‌ నుండి నామినేట్‌ చేస్తున్నట్లు బిజెపి బుధవారం ప్రకటించింది. నేడు వీరు తమ నామినేషన్‌ పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. రైల్వే మంత్రి వైష్ణవ్‌ 2019లో మాదిరిగా ఒడిశాలోని అధికార బిజు జనతాదళ్‌ (బిజెడి) మద్దతుతో ఎన్నికయ్యే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం ఐదు స్థానాలుండగా మురుగన్‌తో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపింది. బిజెపికి నాలుగు సీట్లు, కాంగ్రెస్‌ ఓసీటు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

➡️