త్వరలోనే జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు: ఎన్నికల సంఘం

ఢిల్లీ: నిన్నటిదాకా దేశంలో సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన ఈసీ, త్వరలో కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రక్రియను ప్రారంభించించినట్లు తెలుస్తోంది. కశ్మీర్‌లో ఎన్నికల గుర్తుల కేటాయింపు కోసం రిజిస్టర్డ్‌ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని కమిషన్‌ నిర్ణయించినట్టు భారత ఎన్నికల సంఘం కార్యదర్శి జయదేబ్‌ లాహిరి తెలిపారు. అలాగే రిజర్వేషన్ల కేటాయింపుపైనా కసరత్తు చేపట్టినట్టు వెల్లడించారు. కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ సైతం ఇటీవలే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

➡️