Rashtrapati Bhavan: భారత రత్న అవార్డుల ప్రదానం

ఢిల్లీ : దేశం తరఫున ఆయారంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహానీయులకు ఇటీవల కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో భారత రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మరణానంతరం పీవీ నరసింహారావుకు భారత రత్నను అందించింది. పీవీ తరపున కుమారుడు ప్రభాకర్‌ రావు భారత రత్న పురస్కారాన్ని అందజేశారు. కర్పూరీ ఠాకుర్‌ తరఫున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌, చౌదరీ చరణ్‌ సింగ్‌ తరపున ఆయన మనవుడు జయంత్‌ సింగ్‌, స్వామినాథన్‌ తరపున అవార్డును కుమార్తె నిత్యా రావు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ, కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే, తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆడ్వాణీ ఇంటికెళ్లి ‘భారతరత్న’ ప్రదానం చేయనున్నారు.

➡️