శివసేన ఎంపి సంజయ్ రౌత్‌పై దేశద్రోహం కేసు

Dec 13,2023 10:24 #sedition, #Shiv Sena
bp govt sediction safshiv sena mp sanjay raut

ముంబయి : ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఒక ఆర్టికల్‌ రాసినందుకు శివసేన ఎంపి (రాజ్యసభ) సంజరు రౌత్‌పై దేశద్రోహం, ఇతర ఆరోపణలతో కేసు నమోదైంది. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా ఉన్న రౌత్‌ ఈ నెల 10న వ్యాసం రాసారు. ఈ వ్యాసంలో మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా బిజెపి కోర్టినేటర్‌ నితిన్‌ భుతడ ఫిర్యాదు చేశారు. ఉమర్‌ఖేద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఐసిపిలోని సెక్షన్‌ 124 (ఎ) (దేశద్రోహం), సెక్షన్‌ 153(ఎ), సెక్షన్‌ 505(2) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.తనపై కేసు నమోదు చేయడాన్ని బిజెపి సెన్సార్‌ షిప్‌గా సంజరు రౌత్‌ విమర్శించారు. ‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలబడ్డామని చెప్పుకునే హక్కు బిజెపికి లేదు. ఎందుకంటే నా పోరాటం అలాంటి ఎమర్జెన్సీలకు వ్యతిరేకంగా జరుగుతుంది. సామ్నాలో నేను చేసిన విమర్శలు రాజకీయపరమైనవి’ అని రౌత్‌ పేర్కొన్నారు.

➡️