రాజస్థాన్‌లో సిపిఎం విస్తృత ప్రచారం

brinda-karat-in-rajasthan-elections

జైపూర్‌ : రాజస్థాన్‌లో సిపిఎం విస్తృత ప్రచారం నిర్వహించింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ సికార్‌ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజల వాణిని అసెంబ్లీలో బలంగా వినిపించి, వాటిని పరిష్కరించే వరకూ పోరాడేది సిపిఎం ఎమ్మెల్యేలేనని అన్నారు. సిపిఎం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
దంతారాంగఢ్‌ అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి అమరారామ్‌కు మద్దతుగా ఐద్వా నాయకులు ఆశాశర్మ విస్తృత ప్రచారం చేశారు. ఉపాధి హామీ కార్మికులను కలిసి అమరారామ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు, ప్రజల నుంచి, ఉపాధి హామీ కార్మికుల నుంచి మంచి స్పందన లభించిందని ఆశాశర్మ తెలిపారు.

➡️