CA exam : సిఎ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల తేదీల మార్పు

Mar 20,2024 16:21 #CA exam, #ICAI, #Lok Sabha polls

న్యూఢిల్లీ :    సిఎ ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల తేదీల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఎఐ) మార్పులు చేసింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లు సంబంధిత అధికారులు బుధవారం ప్రకటించారు. ముందుగా నిర్ణయించినట్లు మేనెలలోనే పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ .. పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు తెలిపారు.

రీ షెడ్యూల్‌ ప్రకారం.. సిఎ ఇంటర్‌, గ్రూప్‌ 1 పరీక్ష మే 3, 5, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గ్రూప్‌ 2 పరీక్ష మే 11, 15, 17 తేదీల్లో జరగనున్నాయి.సిఎ ఫైనల్‌, గ్రూప్‌ 1 పరీక్షను మే 2, 4, 8 తేదీల్లో, గ్రూప్‌ 2 పరీక్ష మే 10, 14, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తాజా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది.

లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు యుపిపిఎస్‌సి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను ఎన్నికల అనంతరం జూన్‌ 16న నిర్వహించనున్నట్లు తెలిపింది.

➡️