సింగపూర్‌లో కోవిడ్‌ కేసులు రెట్టింపు

May 20,2024 08:06 #covide, #Singapore

సింగపూర్‌ సిటీ : వారం రోజుల వ్యవధిలోనే సింగపూర్‌లో కోవిడ్‌ కేసులు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 5 నాటికి 13,700గా ఉన్న కేసుల సంఖ్య ఈ నెల 11 నాటికి 25,900కు చేరుకున్నాయి. రోజుకు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 181 నుంచి 250కు చేరుకుంది. అయితే ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసియు)లో చేరే కేసులు సంఖ్య తక్కువగానే ఉండటం కొంచెం ఉపశమనం కలిగిస్తుంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల సామర్థ్యాన్ని, ప్రజా ఆసుపత్రుల సంఖ్య పెంచడానికి సింగపూర్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అత్యవసరం కాని సర్జరీలను తగ్గించాలని ఆసుపత్రులకు సూచించింది. ప్రభావం తక్కువగా ఉన్న రోగులను హోమ్‌ కేర్‌కు లేదా పరివర్తన సంరక్షణ సౌకర్యాల కేంద్రాలకు తరలించాలని సూచించింది. వ్యాక్సినేషన్‌ను పున:ప్రారంభించాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక రోగులకు ఒకవేళ వారు గత 12 నెలల్లో వ్యాక్సిన్‌ తీసుకోకపోతే వారికి వ్యాక్సిన్‌ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను ధరించాలని ప్రజలకు సింగపూర్‌ ఆరోగ్య మంత్రి ఓనగ్‌ యే కుంగ్‌ విజ్ఞప్తి చేశారు.

➡️