16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

Feb 8,2024 09:45 #Bandh, #CITU, #Rural Bandh, #SKM leaders
skm, all india workers union protest on feb 16

 ఎస్‌కెఎం, సిఐటియు పిలుపునకు వెల్లువెత్తిన మద్దతు

న్యూఢిల్లీ : కార్పొరేట్ల లాభాలను పెంచేలా, నిరుద్యోగం పెరిగేలా, పేదల జీవనోపాధులు లాక్కునేలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడాలని కార్మికులు, రైతులు, విద్యార్ధులు, యువత, మహిళ, వ్యవసాయ కార్మికులు, సాంస్కృతిక కార్యకర్తలు, మేథావులు, సామాజిక ఉద్యమాలకు చెందిన వివిధ వేదికలు సంయుక్తంగా విజ్ఞప్తి చేశాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల సంయుక్త వేదిక కలిసి పిలుపిచ్చిన మేరకు ఈనెల 16న దేశవ్యాప్తంగా జరగనున్న పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌కు మద్దతుగా ఆ వేదికలు ఈ విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉపాధిని సృష్టించే కార్యక్రమాలు చేపట్టాలని, ప్రస్తుతమున్న ఖాళీలను భర్తీ చేయాలని, ధరల పెరుగుదలను ఆరికట్టాలని, హామీ ఇచ్చిన కనీస మద్దతు ధర ఇవ్వాలని, వ్యవసాయ ఉపకరణాల వ్యయాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. మతోన్మాద పోకడలను కట్టిపెట్టాలని, ప్రజాతంత్ర హక్కులపై దాడిని ప్రతిఘటించాలని, భారత రిపబ్లిక్‌ లౌకిక, ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించాలని వారు కోరారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధ సంఘాలు మినహా మిగిలిన అన్ని సంఘాలు, వేదికలు ఈ ఉద్యమంతో చేతులు కలుపుతున్నాయి. బిజెపి ప్రభుత్వ కార్పొరేట్‌, మతోన్మాద విధానాలపై ఉద్యమించాలని పిలుపిస్తున్నాయి. పాలక పక్షం తన ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడేవరకు ఈ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశాయి.

➡️