Liquor policy case: కేజ్రీవాల్‌ బెయిల్‌పై నేడు ఆదేశాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే మద్యం కేసుకు సంబంధించి.. మనీ ల్యాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను ఇడి వ్యతిరేకించింది. ఆయన ఎన్నికల ప్రచారం చేసే హక్కు.. ప్రాథమికమైనది కాదని పేర్కొంది. గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను ఇడి దాఖలు చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గనడానికి ఏ రాజకీయ నాయకుడికీ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన దాఖలాలు లేవని ఇడి తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఇడి, కేజ్రీవాల్‌ తరఫున న్యాయవాదుల వాదనలను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మసనం విని.. తీర్పును శుక్రవారానికి రిజర్వు చేసింది. ఒకవేళ.. అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే.. అధికారిక విధుల్లో పాల్గనడం కానీ.. ఫైళ్లపై సంతకాలు కానీ చేయకూడదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

➡️