మెడలో చెప్పుల దండతో ఎన్నికల ప్రచారం

Apr 10,2024 23:28 #2024 elections, #Lucknow

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అలీఘర్‌ స్వతంత్ర అభ్యర్థి పండిట్‌ కేశవ్‌ దేవ్‌ మెడలో చెప్పుల దండ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ ‘చెప్పు’ గుర్తును కేశవ్‌కు కేటాయించడంతో ఇలా చెప్పుల దండ వేసుకుని ఈ గుర్తుపై తనకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

➡️