ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ ..

Mar 3,2024 12:32 #Chhattsigarh, #encounter

రాయ్‌పూర్‌  :    ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌జిల్లాలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌, మావోయిస్టు మరణించినట్లు సీనిర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. ఛోటెబెథియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హిదూర్‌ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది చేపడుతున్న మావోయిస్టు వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ఆ అధికారి తెలిపారు.  హిదూర్‌ అటవీప్రాంతంలో మావోయిస్టులు తిరుగుతున్నారన్న నిర్దిష్ట సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ ప్రారంభించారని అన్నారు. ఈ కాల్పుల్లో రాష్ట్ర పోలీస్‌ విభాగానికి చెందిన బస్తర్‌ ఫైటర్స్‌కు చెందిన కానిస్టేబుల్‌ రమేష్‌ కురేటి మృతి చెందినట్లు వెల్లడించారు. ఘటనా ప్రాంతం నుండి మావోయిస్టు మృతదేహం, ఎకె 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని అన్నారు.

➡️