మోడీ త్రిసూర్‌లో మకాం వేసినా సురేష్‌ గోపి గెలవలేడు: ఎంవీ గోవిందన్‌

Apr 7,2024 07:20 #MV Govindan, #speech

త్రిసూర్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రిసూర్‌ లో మకాం వేసినా బిజెపి అభ్యర్థి సురేష్‌ గోపి గెలవలేరని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ అన్నారు. శనివారం మాల, చలకుడిలో జరిగిన ఎల్‌డిఎఫ్‌ ఎన్నికల ర్యాలీల్లో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించేందుకు ఇడితో పాటు ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కూడా వస్తోంది. వాళ్ల చేతుల్లో మోదీ కత్తి ఉంది.సిపిీఐ(ఎం) త్రిసూర్‌ జిల్లా కమిటీకి దశాబ్దాలుగా ఖాతా ఉంది. డబ్బుకు సంబంధించిన కచ్చితమైన ఖాతా ఉంది. ఏటా ఆడిట్‌ చేసి వివరాలు ఇవ్వడం జరుగుతోంది.అతిపెద్ద ఆర్థిక నేరానికి పాల్పడిన బిజెపి ఖాతాలు స్తంభింపజేయడం కానీ, ఆ పార్టీపై జరిమానా విధించడం కానీ ఎందుకు చేయరు అని గోవిందన్‌ ప్రశ్నించారు.

➡️