కర్ణాటక బిజెపి సోషల్‌ మీడియా పోస్టుపై ఎఫ్‌ఐఆర్‌

Apr 24,2024 23:34 #FIR, #Karnataka BJP, #social media post

బెంగళూరు : కర్ణాటక బిజెపికి అధికారిక సోషల్‌ మీడియా చేసిన ఒక పోస్టుపై బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ‘కాంగ్రెస్‌ మేనిఫెస్టో లేక ముస్లిం లీగ్‌ మేనిఫెస్టోనా’ అనే టైటిల్‌తో చేసిన పోస్టుపై ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. మల్లేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ బృందం ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని చెప్పారు. మంగళవారం నాడు బిజెపి సోషల్‌ మీడియా ఈ పోస్టు చేసింది. ‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 125, ఐపిసిలోని సెక్షన్‌ 153 (అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం) కింద ఈ నెల 24న ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. వివిధ ప్రజల మధ్య విద్వేషం, శత్రుత్వాన్ని ప్రోత్సహించినందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కర్ణాటకలో ఈ నెల 26, మే 7న రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

➡️