మణిపూర్‌లో కాల్పులు.. పోలీస్‌ కమాండర్‌ మృతి

Jan 17,2024 12:13 #gunfights, #Manipur violence

ఇంఫాల్‌ :   మణిపూర్‌లోని  భద్రతా బలగాలు, కుకీల మధ్య బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెంగ్నౌపాల్‌ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలోమణిపూర్‌ కమాండోను ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు.    నివేదిక ప్రకారం..  ఎస్‌బిఐ మోరే సమీపంలోని భద్రతా పోస్ట్‌పై ఉగ్రవాదులు బాంబులు విసిరి కాల్పులు జరిపారని అన్నారు.    ఈ ఘటనలో ఓ పోలీస్ కమాండర్  మరణించారని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని అన్నారు.

గతంలో ఓ   పోలీసు అధికారి హత్యకు సంబంధించి సరిహద్దు పట్టణంలో ఇద్దరు కుకీలను బలగాలు అరెస్టు చేశాయి. దీంతో 48 గంటల తర్వాత  కుకీలు  భద్రతా దళాల పోస్ట్‌పై కాల్పులు జరిపారని అన్నారు. జనవరి 16 అర్ధరాత్రి 12 నుండి తెంగ్నౌపాల్‌లో పూర్తి కర్ఫ్యూ విధించింది. ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలోని కౌత్రుక్‌ గ్రామంలో గ్రామ వాలంటీర్లు, కుకీల మధ్య మంగళవారం రాత్రి రెండు గంటలకు పైగా కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించాయి.

➡️