హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌పై విచారణ వాయిదా

May 22,2024 09:09 #Hemant Soren, #police case

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ఈ పిటీషన్‌ను విచారించింది. తదుపరి వాదనలను బుధవారానికి వాయిదా వేసింది. హేమంత్‌ సోరెన్‌ను మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు చేయడాన్ని సవాల్‌ ట్రయల్‌ కోర్టు, హైకోర్టు ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. దీనికి హేమంత్‌ సోరెన్‌ తరపు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్పందిస్తూ సోరెన్‌ తన అరెస్టును చట్టవిరుద్ధమని సవాల్‌ చేస్తున్నారని, బెయిల్‌, కేసు రద్దు కోరడం లేదని అన్నారు.

➡️