నా నిస్వార్థమైన సేవకు భారతరత్న : అద్వానీ

Feb 3,2024 16:41 #Bharat Ratna Award, #LK Advani

న్యూఢిల్లీ : బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీని భారత రత్న అవార్డు వరించింది. శనివారం అద్వానీకి భారతరత్న అవార్డు ప్రదానం చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో అద్వానీకి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అద్వానీ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ.. ‘నేను 14 ఏళ్ల వయసులోనే ఆరెస్సెస్‌లో వలంటీర్‌గా చేరాను. అప్పటినుండి నాకప్పగించిన ఏ పనైనా అంకిత భావంతో చేశాను. దేశం కోసం నిస్వార్థంగా పనిచేశాను. ‘ఇదం-నా-మమ’ అనే నినాదమే నా జీవితాన్ని ప్రేరేపించింది. ఈ జీవితం నాది కాదు. నా జీవితం నా దేశం కోసమే.’ అని ఆయన అన్నారు.

➡️