నాకు హిందీ అర్థం కాదు 

Jan 26,2024 11:35 #language, #Madras High Court
i dont know hindi madras high court lawyer
  • క్రిమినల్‌ చట్టాలను వాటి అసలు పేర్లతోనే పిలుస్తా
  • మద్రాసు హైకోర్టు జడ్జి

చెన్నై : పేర్లు మారిన క్రిమినల్‌ చట్టాలపై మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హిందీ అర్థం కాదనీ, పాత క్రిమినల్‌ చట్టాల స్థానంలో కొత్త చట్టాలు వచ్చినప్పటికీ.. తాను మాత్రం వాటిని పాత పేర్లతోనే పిలుస్తానని అన్నారు. కోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది డిసెంబర్‌లో కేంద్రం పాత క్రిమినల్‌ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ సాక్ష్య సంహిత, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహితలు వచ్చి చేరాయి. గతేడాది డిసెంబర్‌ 25న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త బిల్లులకు ఆమోదం తెలపటంతో అవి చట్టాలుగా మారాయి. అయితే, ఈ కొత్త చట్టాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయన్న విషయంపై మాత్రం కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఇప్పటికీ స్పష్టం చేయకపోవటం గమనార్హం.

➡️