పివికి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా : సోనియాగాంధీ

Feb 9,2024 15:44 #Sonia Gandhi

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని పి.వి నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌, శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు భారతరత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈమేరకు ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. ఈ ముగ్గురికి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు సోనియా తెలిపారు. పార్లమెంటు వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ ముగ్గురికి భారతరత్న ప్రకటించడం నేను స్వాగతిస్తున్నాను.’ అని ఆమె అన్నారు.

➡️