‘వికసిత్‌ భారత్‌’ స్ఫూర్తితో ముందుకెళ్లాలి : ప్రధాని మోడీ

Dec 31,2023 13:48 #Mann Ki Baat, #PM Modi

న్యూఢిల్లీ   :   దేశం ‘వికసిత్‌ భారత్‌’ మరియు స్వావలంబన స్ఫూర్తితో నిండిపోయిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని 2024 నూతన సంవత్సరంలో కూడా కొనసాగించాలని అన్నారు. మన్‌కీ బాత్‌ రేడియా ప్రసారం 108వ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడారు. భారతదేశం ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని, వికసిత్‌ భారత్‌ మరియు స్వావలంబన స్ఫూర్తితో నిండి ఉందని మోడీ పేర్కొన్నారు. 2024లో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంతో సహా ఈ ఏడాది భారత్‌ దేశం అనేక ప్రత్యేక విజయాలను సాధించిందని ప్రధాని పేర్కొన్నారు.

అలాగే శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రజలంతా దృష్టి సారించాలని అన్నారు. ఫిట్‌ ఇండియా కోసం ప్రముఖులు చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ప్రసార  సమయంలో ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు, భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌,  చెస్‌ లెజెండ్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ మరియు  నటుడు అక్షయ్  కుమార్‌ తమ ఫిట్‌నెస్‌ విషయాలను  వివరించారు.

➡️