రోదసీ రంగంలో అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ : ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

తిరువనంతపురం : రాకెట్‌లు, అంతరిక్ష నౌకలను రూపొందించి, ప్రయోగించేందుకు బహుళజాతి కంపెనీలకు భారత్‌ అంతర్జాతీయ కేంద్రంగా మారగల సత్తా వుందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ శనివారం వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి బోయింగ్‌ వంటి కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌ (ఎంబిఐఎఫ్‌ఎల్‌-24) కార్యక్రమంలో మాజీ ఇస్రో ఇంజనీర్‌, అవార్డు పొందిన రచయిత వి.జె.జేమ్స్‌తో మాట్లాడుతూ సోమనాథ్‌ పై వ్యాఖ్యలు చేశారు. భారత్‌ నుండే రాకెట్‌లు రూపొందించి, ఎందుకు ప్రారంభించరాదు? అంటే దానికోసం ఇక్కడ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధిపరచాల్సిన అవసరం వుందన్నారు. చంద్రయాన్‌, ఆదిత్య మిషన్‌ల మాదిరిగా శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించే మరిన్ని మిషన్‌లు చేపట్టాలని ఇస్రో భావిస్తోందని చెప్పారు. 2040కల్లా చంద్రుని ఉపరితలంపై భారతీయ భూమి వుండాలన్నారు. ఆ దార్శనికత, లక్ష్య సాధన దిశగా ఇప్పుడు తాము పని చేస్తున్నామని చెప్పారు.

➡️