థాయ్‌లాండ్‌ కాల్పుల్లో భారతీయుని మృతి

May 20,2024 12:07 #kerala, #thailand
  • దోపిడీకి యత్నిస్తూ దుండగుల కాల్పులు

కొచ్చి : థాయ్‌లాండ్‌ పర్యటనకు వెళ్లిన భారతీయునిపై కాల్పులు జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో కేరళలోని మలయాటూరు కడపర వట్టపరంబన్‌కు చెందిన వెట్టీలు వర్గీస్‌ సోమవారం మృతి చెందాడు. విహారయాత్రకు వెళ్లిన మలయాళీ అయిన వర్గీస్‌పై దోపిడీ యత్నం జరిగింది. ఎదురుదాడికి ప్రయత్నించిన వర్గీస్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి థాయ్‌లాండ్‌లో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకున్నట్లు బంధువులు ‘దేశాభిమాని’కి తెలిపారు. వర్గీస్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు కొన్నేళ్లుగా ముంబైలో నివసిస్తున్నారు.

➡️