ఆ వార్తలు నిరాధారం : మనీష్‌ తివారీ

Feb 18,2024 15:14 #BJP, #Congress MP, #Manish Tewari

 న్యూఢిల్లీ :    సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపి మనీష్‌ తివారీ బిజెపిలో చేరుతున్నారనే వార్తలపై ఆయన కార్యాలయం స్పందించింది. మనీష్‌ తివారీ బిజెపితో టచ్‌లో ఉన్నారని, పంజాబ్‌లోని లుథియానా పార్లమెంట్‌ స్థానం నుండి బరిలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తలిసిందే.   ఈవార్తలపై ఆయన కార్యాలయం  ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన బిజెపిలో చేరుతున్నారనే ఊహాగానాలు నిరాధారమైనవని కొట్టిపారేసింది.  మనీష్‌ తివారీ తన నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారని, అక్కడి అభివృద్ధి కార్యక్రమానలు స్వయంగా పర్యవేక్షిస్తున్నాని పేర్కొంది. గత రాత్రి ఆయన కాంగ్రెస్‌ కార్యకర్త నివాసంలో బసచేశారని తెలిపింది.

ఇటీవల మహారాష్ట్ర కీలక కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో మనీష్‌ తివారీ కూడా బిజెపి తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలపై మనీష్‌ తివారీ కార్యాలయం పైవిధంగా స్పందించింది. కార్యాలయం ఆదివారం స్పందించింది.. ”అవి పూర్తిగా నిరాధారమైనవి. మనీశ్‌ నియోజకవర్గంలో అభివఅద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. గత రాత్రి ఆయన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త ఇంట్లో విశ్రాంతి తీసుకొన్నారు” అని పేర్కొంది. కాగా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ పార్టీ మారనున్నారనే ప్రచారాన్ని కూడా ఆ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ, సీనియర్‌ నేత దిగ్విజరు సింగ్‌ తీవ్రంగా ఖండించారు. అయితే పార్టీ మార్పుపై ముందుగా మీడియాకు సమాచారమిస్తానని కమల్‌నాథ్‌ పేర్కొనడం గమనార్హం.

➡️