కాంగ్రెస్‌లో బీరేంద్ర సింగ్‌ చేరిక

న్యూఢిల్లీ : ఒక రోజు క్రితమే బిజెపికి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి బీరేంద్ర సింగ్‌, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే ప్రేమలత మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వంలో బీరేంద్ర సింగ్‌ ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు. మంగళవారం న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముకుల్‌ వాస్నిక్‌ సమక్షంలో బీరేంద్ర సింగ్‌ కాంగ్రెస్‌లో చేరారు. బీరేంద్ర సింగ్‌ చేరికతో హర్యానాలో కాంగ్రెస్‌ మరింత బలపడుతుందని ముకుల్‌ వాస్నిక్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్‌ హుడా, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సర్జేవాలా ఇతర నాయకులు పాల్గొన్నారు. బీరేంద్ర సింగ్‌ కుమారుడు బ్రిజేంద్ర సింగ్‌ కొన్ని నెలల క్రితమే కాంగ్రెస్‌లో చేరారు.

➡️