మాలీవాల్‌కు న్యాయం జరుగుతుంది ..తొలిసారి స్పందించిన కేజ్రీవాల్‌

May 22,2024 23:59 #AAP leader Kejriwal, #speech

న్యూఢిల్లీ: ఆమ్‌ రాజ్యసభ ఎంపి స్వాతి మాలీవాల్‌పై దాడి కేసు విషయంలో కేజ్రీవాల్‌ బుధవారం తొలిసారిగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగడంతో పాటు మాలీవాల్‌ న్యాయం అందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మాలీవాల్‌పై కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్‌ దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ‘ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నా. న్యాయం జరగాలి. ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయి. ఇద్దరి నుంచి నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందుతుంది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున.. ఏమీ మాట్లాడలేను’ అని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.కాగా, కేసులో బిభవ్‌ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు ముంబయికి తీసుకెళ్లారు. స్వాధీనం చేసుకున్న నిందితుడి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సీసీటీవీ రికార్డులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు.

➡️