పని చేయడానికి అత్యంత ఇష్టపడే రాష్ట్రంగా కేరళ

Dec 22,2023 10:41 #kerala, #most preferred, #State

తిరువనంతపురం : ఎల్‌డిఎఫ్‌ పాలనలో కేరళ మరో ఘనత సాధించింది. పని చేయడానికి యువతీ యువకులు అత్యంత ఇష్టపడే రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఇండియా స్కిల్స్‌ రిపోర్టు 2024 ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది యువతీ యువకుల్ని సర్వే చేసి ఈ నివేదిక తయారు చేశారు. విభిన్న నైపుణ్యాలు ఉన్న యువతీ యువకులు తాము పని చేయడానికి అత్యంత ఇష్టపడే రాష్ట్రంగా కేరళను ఎన్నుకున్నారు. తిరువనంతపురం, కొచ్చి నగరాలు యువతను ఆకర్షించడంలో ముందు ఉన్నాయి. విద్య పట్ల సమతుల్య విధానాన్ని అందించడంలోనూ, భవిష్యత్తు నైపుణ్యాలను మెరుగుపర్చడంలోనూ కేరళ చేస్తున్న కృషి యువతీ యువకులు ప్రశంసించారు. అలాగే కంప్యూటర్‌ నైపుణ్యాలను పెంపొందించడంలో కేరళ గొప్పతనాన్ని ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ స్కిల్‌ పార్కులు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లను దేశంలోనే అధునాతన సాంకేతికత శిక్షణకు ఆదర్శప్రాయమైన నమూనాలుగా నివేదిక గుర్తించింది.

➡️