కేరళలో 2.7 కోట్ల మంది ఓటర్లు

Jan 24,2024 09:59 #kerala, #Voter List
kerala voters information

తిరువనంతపురం : కేరళలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,70,99,326కు చేరింది. వీరిలో మహిళా ఓటర్లు 1,39,96,729 మందిగా, పురుషులు 1,31,02,288 మంది ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 309 మంది ఉన్నారు. తిరువనంతపురంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సంజయ్ కౌల్‌ ఈ వివరాలు వెల్లడించారు. తుది జాబితాలో 6,20,998 మంది చేరారని, మరణాలు, డూప్లికేషన్‌ వంటి కారణాల ద్వారా 3,75,897 మందిని తొలగించినట్లు తెలిపారు. ఈ జాబితా ప్రకారం కేరళ ఓటర్లలో స్త్రీ, పురుష లింగ నిష్పత్తి 1,068:1000గా ఉంది. విదేశాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య 88,223గా ఉండగా, వికలాంగ ఓటర్లు 2,62,213 మంది ఉన్నారు.

➡️