అతిపెద్ద పులుల అభయారణ్యం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

Nov 27,2023 10:19 #Reserve Forest, #Tiger
madhya-pradesh-gets-india-s-largest-tiger-reserve-in-damoh

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం (టైగర్‌ రిజర్వు) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం పచ్చజెండా ఊపింఇ. సుమారు 2300 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఈ రిజర్వు ఏర్పాటు కానుంది. ఇందుకోసం మధ్యప్రదేశ్‌ లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం (నౌరాదేహి విల్డ్‌లైఫ్‌ శాంక్చురీ), రాణి దుర్గావతి వన్యప్రాణి అభ్యయారణ్యాలను కలిపివేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. ఈ రెండు వన్యప్రాణి అభయారణ్యాలు సాగర్‌, దమోV్‌ా, నర్సింగ్‌పుర్‌, రైసెన్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ వల్ల దేశంలో పెద్ద పులుల సంఖ్య పెరగడంతోపాటు, స్థానికంగా పర్యాటక రంగం మరింత అభివద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మూడు నెలల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దమోV్‌ా డివిజన్‌ అటవీ శాఖ అధికారి ఎంఎస్‌ ఉకెరు తెలిపారు.

➡️