ఎంపి పదవికి టిఎంసి నేత మిమిచక్రవర్తి రాజీనామా

కోల్‌కతా :  ప్రముఖ  నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మిమి చక్రవర్తి ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. రాజీనామా లేఖను టిఎంసి అధ్యక్షురాలు మమతా బెనర్జీకి పంపినట్లు తెలిపారు. అయితే మమతా బెనర్జీ ఈ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. జాదవ్‌పూర్‌ అభివృద్ధి కోసం కలలు కన్నానని, అయితే స్థానిక నేతల నుండి ఇబ్బందులను ఎదుర్కొన్నానని అన్నారు.  సినీ పరిశ్రమ నుండి  వచ్చిన వ్యక్తి    దేనికీ  పనికి రాడు అంటూ అపఖ్యాతిపాలు చేయడం చాలా సులభమని అన్నారు. రాజకీయ నైతిక విలువలను తాను అర్థం చేసుకోలేకపోయానని అన్నారు.    బెంగాల్‌ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి అయిన మిమి 2019 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్‌ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమె బిజెపి అభ్యర్థి అనుపమ్‌ హజ్రాపై సుమారు 2, 95,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

➡️