ఆ నలుగురి సేవలో మోడీ : ప్రియాంక గాంధీ

May 13,2024 01:15 #priyanka gandhi, #speech

లక్నో: దేశ సంపదను ప్రధాని మోడీ కేవలం నలుగురు బడా పారిశ్రామిక వేత్తలకు దోచిపెడుతున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని రారుబరేలిలో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ఆ నలుగురు బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకు ప్రధాని పనిచేస్తున్నారని అన్నారు. పేదలు, రైతుల కడుపుకొట్టి పారిశ్రామిక దిగ్గజాలకు మోడీ దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ అనూహ్యంగా చేపట్టిన నోట్ల రద్దు కోట్లాది చిరు వ్యాపారులు, మహిళలకు కష్టాలు తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ హయాంలో ఈ పదేళ్లలో పేదల స్థితిగతులు ఏమాత్రం మెరుగుపడలేదని అన్నారు. కాషాయ పాలకులు చేసిన అరకొర పనులను వార్తా ఛానెల్స్‌లో అదేపనిగా చూపుతున్నారని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు.

➡️