14 ప్రాంతాల్లో ఎన్‌ఐఎ సోదాలు

Nov 23,2023 09:53 #NIA, #Raids
nia-raids-pfi-offices-across-states-several-radical-outfit-members

న్యూఢిల్లీ : పంజాబ్‌, హర్యానాలోని 14 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాపై దాడులకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఎన్‌ఐఎ ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి 19, జులై 2న శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్‌ కాన్సులేట్‌పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కార్యాలయంలోకి చొరబడిన దుండగులు కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు, భవనానికి నిప్పు పెట్టారు. కాన్సులేట్‌ అధికారులపై దాడికి కూడా యత్నించారు. ఈ దాడుల్లో భాగమైన కొంతమంది వ్యక్తులను ఎన్‌ఐఎ ఇప్పటికే గుర్తించింది. ఈ దాడుల వెనుక ఉన్న పూర్తి కుట్రను ఛేదించే ప్రయత్నంలోనే బుధవారం ఉదయం రెండు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో సోదాలు చేసింది. పంజాబ్‌లోని మోగా, జలంధర్‌, లూథియానా, గురుదాస్‌పూర్‌, మొహాలి, పాటియాలా జిల్లాలోనూ, హర్యానాలోని కురుక్షేత్ర, యమునానగర్‌ల్లోనూ ఎన్‌ఐఎ దాడులు జరిపింది.

➡️