జైళ్లలో కుల ఆధారిత వివక్ష, విభజన వద్దు

Mar 1,2024 10:55 #Supreme Court

సుప్రీం తీర్పుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఖైదీలను వారి కులం, మతం ఆధారంగా వేరు చేయడానికి అందించే ”వివక్షపూరిత” నిబంధనలు వారి సంబంధిత జైలు మాన్యువల్‌, చట్టంలో లేవని నిర్ధారించుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల(యుటి)లోని జైలు పరిపాలనలను విభాగాలకు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి జైలు మాన్యువల్‌లు, చర్యలు తమ దృష్టికి వచ్చాయని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కుల ఆధారిత వివక్ష, జైళ్లలో ఖైదీలను వేరుచేస్తున్నారని ఆరోపించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్‌)పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు 11 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన రెండు నెలల తరువాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది.

➡️