రిపబ్లిక్‌ డే వరకు ఢిల్లీ విమానాశ్రయంపై కేంద్రం ఆంక్షలు

 న్యూఢిల్లీ :   రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. జనవరి 26 వరకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 10.20 గంటల నుంచి 12.45 మధ్య టేకాఫ్‌, ల్యాండింగ్‌లపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రిపబ్లిక్‌ డే రోజున ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేయనున్నట్లు తెలిపింది.  అయితే  వైమానిక, నేవీ, బిఎస్‌ఎఫ్‌ల హెలికాఫ్టర్‌ కార్యకలాపాలు, ఇతర విఐపిల ప్రయాణాలకు మినహాయింపునిచ్చింది. ఈ ఏడాది రిపబ్లిక్‌ డే వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.  రిపబ్లిక్‌ డే వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు  ముఖ్య అతిథిగా హాజరుకావడం వరుసగా ఇది ఆరవసారి కావడం గమనార్హం.

➡️